గుడ్ న్యూస్... భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ. 41 తగ్గించాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు (ఏప్రిల్ 1) ధరలను సవరించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 

తగ్గిన ధరలతో ఈరోజు నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,762గా ఉండనుంది. హైదరాబాద్ లో రూ. 1,985, చెన్నైలో రూ. 1,921, ముంబైలో రూ. 1,713గా ధర ఉండబోతోంది.

Commercial Gas Cylinder Price
LPG Price Reduction
Oil Companies
India
Delhi
Hyderabad
Chennai
Mumbai
19kg Commercial Cylinder
Cooking Gas Price

More Telugu News